Monday, December 23, 2024

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం..ముఠా గుట్టు రట్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసానికి పాల్పడుతున్న ముఠా గుట్టును సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. నకిలీ వెబ్‌సైట్, కాల్ సెంటర్ ఏర్పాటు చేసి అమాయకులను మోసం చేసినట్లు సైబర్ క్రైం డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు. ఈ ఫేక్ కాల్ సెంటర్‌ను చిత్తూరు జిల్లా పీలేరు కేంద్రgగా నడుస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశామని వెల్లడించారు. ఈ కేసులో సాయి శరన్ కుమార్ ప్రధాన నిందితుడని, ఆన్ లైన్ లో ట్రేడింగ్ పేరుతో కాల్స్ చేయించి మోసం చేస్తున్నాడని వివరించారు. ఐదుగురు సభ్యుల మూఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టయిన నిందితుల వద్ద నుంచి 31లాప్‌టాప్‌లు, 6 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు బ్యాంక్ అకౌంట్ సీజ్ కోసం అధికారులని కోరామన్నారు.

డేటా ఎక్కడ నుండి తీసుకున్నారు అనేది విచారణ చేస్తున్నామని చెప్పారు. మొత్తం 5 బ్యాంక్ అకౌంట్లును సీజ్ చేసినట్లు డిసిపి తెలిపారు. డీ మ్యాట్ అకౌంట్ యూజర్, పాస్ వర్డ్ తీసుకొని సాయి గ్యాంగ్ ఆపరేట్ చేస్తుందన్నారు. రోజు వారి ట్రేడింగ్‌లో లాభాలు వస్తాయని చెప్పి కాల్ సెంటర్ ద్వారా కాల్ చేసి నమ్మిస్తున్నారని వెల్లడించారు. డీ మ్యాట్ అకౌంట్ వివరాలు తీసుకుని నిందితుల బ్యాంక్ అకౌంట్‌లు వివరాలు ఇచ్చి అమౌంట్ ను వీరి అకౌంట్ లోకి బదిలీ చేసుకున్నారని తెలిపారు. 140 బాధితుల నుంచి 1కోటి 8 లక్షలు మోసం జరిగిందని, ఎనిమిది నెలలుగా ఈ ముఠా సభ్యులు మోసానికి పాల్పడుతున్నారని డిసిపి స్నేహా మెహ్రా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News