Friday, December 20, 2024

రాబరీ చేసిన ఐదుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -
కత్తితో బెదిరించిన నిందితులు
లిఫ్ట్ ఇచ్చినందుకు దోచుకున్న ఐదుగురు
వివరాలు వెల్లడించిన ఆసిఫ్‌నగర్ ఎసిపి శివమారుతి

హైదరాబాద్: లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని బెదిరించి డబ్బులు దోచుకున్న ఐదుగురు నిందితులను ఆసిఫ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు బాలురు ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.35,000 నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫ్‌నగర్ ఎసిపి శివమారుతి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చాంద్రాయణగుట్ట, బార్కస్‌కు చెందిన జయంత్ ఈ నెల 6వ తేదీన రాజేంద్రనగర్‌లో ఉంటున్న తన బావమరిదికి చిట్టీ డబ్బులు ఇచ్చేందుకు బైక్‌పై బయలు దేరాడు.

ఈ క్రమంలోనే నాంపల్లికి చెందిన ఎండి షాహిద్ లిఫ్ట్ అడిగాడు. తన తల్లికి రోడ్డు ప్రమాదం జరిగిందని తనను అత్తాపూర్‌లో దించాలని కోరాడు. పిల్లర్ నంబర్ 68 వద్దకు రాగానే వేగంగా వెళ్లాలని ఎండి షాహిద్ బైక్‌ను తీసుకుని డ్రైవింగ్ చేశాడు. బైక్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. అప్పటికే అక్కడ నాంపల్లికి చెందిన షేక్ అక్రం, ఎండి నాసిర్, ఇద్దరు బాలురు ఉన్నారు. అందరూ కలిసి బాధితుడిని బెదిరించి రూ.40,000 నగదు, మొబైల్ ఫోన్‌ను లాక్కున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News