Sunday, December 22, 2024

గంజాయి విక్రయిస్తున్న ఐదుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.120 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరో మహిళ పరారీలో ఉంది. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…అప్పర్ ధూల్‌పేటకు చెందిన రేఖాబాయ్ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది దాడి చేశారు.

గంజాయి విక్రయిస్తున్న శోభాబాయ్, రేఖాబాయ్, మాలతిబాయ్, అరుణబాయ్, సన్నీని అరెస్టు చేయగా, పూనం బాయ్ పరారీలో ఉంది. ఆపరేషన్ ధూల్‌పేట చేపట్టిన ఎక్సైజ్ సిబ్బంది ప్రతి రోజు దాడులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గత కొంత కాలం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. గంజాయి పట్టుకున్న బృందంలో ఎస్‌టిఎఫ్ సిఐలు మధు బాబు, గోపాల్‌తోపాటు లలితా, భాస్కర్ గౌడ్, ఎస్సైలు భాస్కర్‌రెడ్డి, అజి మ్, శ్రీధర్, హెడ్‌కానిస్టేబుళ్లు, ప్రకాష్, రాకేష్, మహేష్ కానిస్టేబుళ్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News