Monday, December 23, 2024

జూనియర్ లైన్‌మెన్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఐదుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Five arrested in junior linemen question paper leakage case

మనతెలంగాణ, హైదరాబాద్ : జూనియర్ లైన్‌మెన్ పరీక్ష పత్రాల లీకేజీ కేసులో కీలక సూత్రదారులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులే నిందితులుగా ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం…అంబర్‌పేట, ప్రేమ్‌నగర్, తిరుమల ఎమరాల్డ్‌కు చెందిన మహ్మద్ ఫైరోజ్ ఖాన్ మలక్‌పేట డివిజన్‌లో ఎడిఈగా, సూర్యాపేట జిల్లా, కోదాడ టౌన్‌కు చెందిన మంగళగిరి సైదులు మిర్యాలగూడ సబ్‌స్టేషన్ పరిధిలో ఎడిఈగా పనిచేస్తున్నాడు. నల్గొండ జిల్లా, మిర్యాలగూడ, తడకమల్ల గ్రామానికి చెందిన భాషరాజు నవ్య ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది, మిర్యాలగూడకు చెందిన షేక్ సాజన్ విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు, నకిరేకల్‌కు చెందిన సయిద్ ఖలీముల్ల ఇంజనీరింగ్ చేశాడు. చనగాని శివప్రసాద్ ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌గా పనిచేస్తున్నాడు. అందరూ కలిసి జూనియర్ లైన్‌మెన్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు సమాధానాలు చేరవేసేందుకు ముఠాగా ఏర్పడ్డారు.

జూనియర్ లైన్‌మెన్ పరీక్షను విద్యుత్ శాఖ జూలై17, 2022వ తేదీన పరీక్ష నిర్వహించింది. ఈ క్రమంలోనే పరీక్ష రాస్తున్న అభ్యర్థి సిహెచ్. శివప్రసాద్ మొబైల్ తీసుకుని పరీక్షకు వెళ్లాడు. నిందితులకు శివప్రసాద్ ఫోన్‌లో ప్రశ్నలు చెప్పగా, వారు మైక్రోఫోన్‌లో సమాధానాలు చెప్పారు. ఈ విషయం బయటపడడంతో శివప్రసాద్‌ను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయం బయటపడింది. విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగులు ముఠాగా ఏర్పడి మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడినట్లు తెలిసింది. జూనియర్ లైన్‌మెన్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులతో రూ.5లక్షలు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకుని సమాధానాలు చేరవేసినట్లు తేలింది. పరీక్ష రాస్తున్న అభ్యర్థుల వద్ద నుంచి లక్ష రూపాయలను అడ్వాన్సుగా తీసుకుని మొబైల్ తీసుకుని వెళ్లిన వారికి మైక్రోఫోన్ సాయంతో సమాధానాలను చేరవేశారు. ఈ విషయం బయటపడడంతో అదేశాఖకు చెందిన ఉద్యోగులనుఘట్‌కేసర్,మల్కాజ్‌గిరిసిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారిపై 409,419,420,468,471,201,120(బి), 511 ఐపిసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇన్స్‌స్పెక్టర్లు సైదులు, బాలు చౌహాన్ దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News