- Advertisement -
బెంగళూరు : మైసూరులో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన కేసు దర్యాప్తులో పురోగతి కనిపించింది. ఈ కేసుకు సంబంధించి అయిదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు. ఆరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారని పేర్కొన్నారు. అరెస్టయిన అయిదుగురు తమిళనాడులోని తరుప్పూర్ జిల్లాకు చెందిన అరటిపండ్లు విక్రయించే కూలీలుగా పోలీసులు గుర్తించారు. అయితే వారిలో ఒకరు 17 ఏళ్ల బాలనేరస్తుడని అనుమానిస్తున్నారు. తమిళనాడులోని సత్యమంగళలో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో వ్యక్తిని కర్ణాటకలోని చామరాజనగర్లో పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన నలుగురు నిందితుల్లో ముగ్గురు నేర చరిత్ర కలిగి ఉన్నారు.
- Advertisement -