Monday, December 23, 2024

వ్యభిచారం కేసులో ఐదుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఓ స్టార్ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.89,500 నగదు, రెండుకార్లు, మూడు బైక్‌లు, రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు ట్యాబ్‌లు, 45 డెబిట్, క్రెడిట్ కార్డులు, మూడు పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు, సిమ్‌కార్డులు, 25ఆధార్‌కార్డులు, ఏడు పాన్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…అమీర్‌పేట, మధురానగర్‌కు చెందిన కె.సూర్యకుమారి అలియాస్ వర్షా అలియాస్ ముడిసే సూర్యకుమారి అలియాస్ అంజలీ అలియాస్ దాసరి అంజలీ అలియాస్ చిట్టి అలియాస్ కుమారి, అలియాస్ రాణి అలియాస్ పల్లవి అలియాస్ రాజని అలియాస్ లక్ష్మివ్యభిచార నిర్వాహకురాలు. ఎపిలోని తిరుపతి, చంద్రగిరిమండలం, మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన కె. విజయశేఖర్ రెడ్డి మెయిల్ ఆర్గనైజర్, పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన అర్కోజిత్ ముఖర్జీ బల్కంపేటలో ఉంటూ వ్యభిచారంలో సబ్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్నాడు.

ఎపిలోని తిరుపతికి చెందిన వేణుగోపాల్ బాలాజీ, మణికొండకు చెందిన కిలారు కీర్తి తేజ కస్టమర్. సూర్యకుమారి, విజయశేఖర్ రెడ్డి ఇద్దారు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విజయవాడకు చెందిన సూర్యకుమారి గతంలో వ్యభిచారం నిర్వహిస్తుండడంతో పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ పోలీసులు 2020లో అరెస్టు చేసి పిడి యాక్ట్ పెట్టారు. ఇప్పటి వరకు సూర్యకుమారిపై 16 పిటా కేసులు నమోదయ్యాయి. నిందితులు ఎపి, వెస్ట్‌బెంగాల్, త్రిపుర తదితర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకుని వచ్చి ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్నారు. ఆన్‌లైన్ యువతులను బుక్ చేసుకునేందుకు ఏకంగా శేఖర్ రెడ్డి డేటాబేస్‌ను తయారు చేయించాడు. దాని ద్వారా లాడ్జిలు, స్టార్ హోటళ్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సూర్యకుమారి పోలీసులకు చిక్కకుండా వివిధ పేర్లతో ఆన్‌లైన్‌లో ట్రాన్‌జాక్షన్స్ నిర్వహిస్తోంది. ఈ విషయం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి, ఆరుగురు యువతులను రెస్కూ హోంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై 370,370 ఏ, ఐపిపి, పిటా యాక్ట్ 3,4,5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు కోసం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ జంగయ్య, ఎస్సై రంజిత్‌కుమార్, నవీన్, అరవింద్ గౌడ్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News