Wednesday, January 22, 2025

కేరళ ఇంటిలో ఐదు శవాలు లభ్యం

- Advertisement -
- Advertisement -

కొట్టాయం: కేరళ కొట్టాయంలోని పాలా ప్రాంతం సమీపంలో తమ అద్దె ఇంటిలో ఐదుగురు కుటుంబ సభ్యులు విగత జీవులుగా కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను జైసన్ థామస్ (44), అతని భార్య, ముగ్గురు పిల్లలుగా గుర్తించారు. పిల్లలు పది సంవత్సరాల లోపు వయస్కులు.

వారు పూవరాణి కొచ్చుకొట్టారం ప్రాంతంలో అద్దె ఇంటిలో నివసిస్తున్నారు. జైసన్ ఉరికి వేలాడుతూ కనిపించినట్లు, అతని భార్య, పిల్లల మృతదేహాలు రక్త స్రావం గుర్తులతో మంచంపై ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. తన భార్య, పిల్లలను చంపి జైసన్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News