Monday, December 23, 2024

టోనీతో ఏడుగురు వ్యాపారులకు సంబంధాలు…

- Advertisement -
- Advertisement -

Five businessmans linked with tony

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఏడుగురు వ్యాపారవేత్తలను కోర్టులో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. వ్యాపారవేత్తలకు 14 రోజుల రిమాండ్ విధించామని కోర్టు పేర్కొంది. ఏడుగురు వ్యాపారవేత్తలను చంచల్‌గూడ జైలుకు తరలించారు. డ్రగ్స్ కేసులో వ్యాపార వేత్తల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముంబయి డ్రగ్ మాఫియా డాన్ టోనీతో వ్యాపారవేత్తలకు సంబంధాలపై ఆరా తీశారు. 15 రోజులకు ఒకసారి ముంబయి బ్యాచ్‌ను టోనీ హైదరాబాద్‌కు పంపిస్తున్నాడు. హైదరాబాద్ ఓయో రూమ్‌లో మకాం వేసి వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసేవారు. 60 మంది యువకులతో టోనీ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. పోలీసులకు చిక్కకుండా డ్రగ్స్‌ను టోనీ బ్యాచ్ హైదరాబాద్ తీసుకొచ్చేవారు. వ్యాపారవేత్తలకు గ్రాము కొకైన్ 20 వేల రూపాయలకు చొప్పున విక్రయించేవారు. హైదరాబాద్ వ్యాపారవేత్తలు గత నాలుగేళ్ల నుంచి టోనీ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News