Sunday, January 19, 2025

మార్వే క్రీక్ జలాల్లో ముగ్గురు చిన్నారులు గల్లంతు

- Advertisement -
- Advertisement -

ముంబై : ముంబై లోని మలద్ వెస్ట్‌లో ఉన్న మార్కేక్రీక్ జలాల్లో ఐదుగురు చిన్నారులు ఆదివారం ఉదయం 9. 38 గంటలకు ప్రమాదవశాత్తు మునిగిపోయారు. వీరిలో ఇద్దరిని బయటకు తీసుకురాగలిగారు. మరో ముగ్గురి జాడ గల్లంతయ్యింది. వీరంతా 12 నుంచి 16 ఏళ్ల లోపు వారే. గల్లంతయిన బాలుర కోసం పోలీసులు, తీర ప్రాంత గస్తీదళం గాలిస్తున్నారు. మార్వేక్రీక్ లోని షోర్‌లైన్ నుంచి

సుమారు అర కిలోమీటరు దూరం లోని జలాల్లో బాలురు మునిగిపోయారు. ఐదుగురు బాలురలో కృష్ణజితేంద్ర హరిజన్ (16),అంకుష్ భరత్ శివారే (13) సురక్షితంగా బయటపడగా, శుభం రాజ్‌కుమార్ జైశ్వాల్ (12). నిఖిల్ సాజిద్ కయంకూర్ (13), అజయ్ జితేంద్ర హరిజన్ (12) జాడ గల్లంతైంది. బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్‌లు, కోస్ట్ గార్డ్, ఇతర సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News