Thursday, January 23, 2025

ఎపిలో రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -
Five city dwellers killed in Road accident At AP
నగర వాసులు ఐదుగురు మృతి

కృష్ణా : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు మృతిచెందారు. హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన హుడా కాలనీకి చెందిన కుటుంబరావు, ఆయన భార్య మార్తమ్మ, శాంతి, ఇందిర, ఆరు నెలల పాప ప్రిన్సీ,కుమారుడు జోషితో కలిసి బయలుదేరారు. మనుమరాలు ప్రిన్సీ అన్నప్రాసనం కోసం పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెం కారులో వెళ్తున్నారు. కారు ఎపిలోని కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట మండలం గౌరవం వద్ద వేగంగా వెళ్తున్న కారు కల్వర్టును ఢీకొట్టింది. దీంతో కారు నాగార్జున సాగర్‌లోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు కుటుంబరావు, మార్తమ్మ, శాంతి, ఇందిర, ప్రిన్సీ(6) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు కన్నుమూశారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జుయింది. కుటుంబరావు కుమారుడు జోషి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News