Monday, December 23, 2024

మహారాష్ట్రలో డిఇఎంయు పాసింజర్ రైల్లో మంటలు

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం డీజిల్- ఎలెక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(డిఇఎంయు) పాసింజర్ రైలుకు చెందిన ఐదు బోగీలకు మంటల్లో చిక్కుకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని రైల్వే అధికారులు తెలిపారు.

బీడ్ జిల్లాలోని అష్తి స్టేషన్ నుంచి అహ్మద్‌నగర్ వెళుతున్న రైలులో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వారు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో డిఇఎంయు పాసింజర్ రైలులో మంటలు మంటలు వ్యాపించాయని, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని సెంట్రల్ రైల్వే సిపిఆర్‌ఓ శివరాజ్ మానస్‌పురే తెలిపారు. మంటలను ఆర్పడానికి అహ్మద్‌నగర్ నుంచి అగ్నిమాపక శకటాలను రప్పించినట్లు ఆయన తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News