Sunday, January 19, 2025

ఆ హంతకులకు జీవిత ఖైదు పడాలి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ హత్య కేసులో నిందితులను దోషులుగా ఢిల్లీ కోరు బుధవారం ప్రకటించింది. దీనిపై ఆమె తల్లి స్పందించారు. తన కుమార్తెను చంపిన వారికి జీవిత ఖైదు విధించాలని మాధవీ విశ్వనాథన్ కోరారు. తమ కూతుర్ని కోల్పోయి 15 ఏళ్లుగా తాము అనుభవించిన బాధనే వాళ్లూ అనుభవించాలన్నారు. జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీ కోర్టు బుధవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే . ఈ కేసులో నలుగురు నిందితులు రవికపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మల్లిక్, అక్షయ్ కుమార్‌లను దోషులుగా కోర్టు నిర్ధారించింది. వారికి సాయం చేశారన్న అభియోగాలపై అజయ్ సేథిని దోషిగా ప్రకటించింది. వీరికి అక్టోబర్ 26న శిక్షలు ఖరారవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News