Sunday, December 22, 2024

దేశంలో ఐదు కోట్ల పెండింగ్ కేసులు: జస్టిస్ భట్టు దేవానంద్

- Advertisement -
- Advertisement -

అమరావతి: సామాన్యుల పక్షాన నిలిచినా అంగీకరించలేని ఒక విచారకర పరిస్థితి నెలకొందని జస్టిస్ భట్టు దేవానంద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులో ఆలిండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాద్రాసు హైకోర్టు జడ్జి జస్టిస్ భట్టు దేవానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టు ప్రసంగించారు. సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటున్నామని, సమాజంలో చాలా సంకట పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో సామాన్యులకు న్యాయం జరిగేలా చేసే కృషి కీలకమని తెలిపారు.

న్యాయం జరిగేలా చేసే కృషిలో న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకమన్నారు. కేసుల విచారణ ఆలస్యం కావడం పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పారు. సామాన్యుల కేసులు ఏళ్ల తరబడి విచారణ సాగుతున్నాయని, ప్రముఖులు, కార్పొరేట్ల కేసులు మాత్రం త్వరంగా పరిష్కారమవుతున్నాయని భట్టు దేవానంద్ వెల్లడించారు. పెద్ద నేరాల్లో ప్రముఖులుంటే మాత్రం కేసులు అంగుళం కూడా కదలవని, కేసు విచారణ త్వరగా ముగిసేలా న్యాయవాదులు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. న్యాయవాదులు చొరవ చూపినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతోందని స్పష్టం చేశారు. దేశంలో ఐదు కోట్ల పెండింగ్ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోందని, బార్ కౌన్సిల్, కోర్టు బెంచ్ సమన్వయంతో కేసులు త్వరగా పరిష్కరించాలని భట్టు దేవానంద్ సలహా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News