Monday, December 23, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని

- Advertisement -
- Advertisement -
Five days week work for government employees
చత్తీస్‌గఢ్ సిఎం భూపేష్ బఘేల్ వెల్లడి

రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని ప్రభుత్వోద్యోగులకు ఇక నుంచివారానికి ఐదు రోజుల పని అమలు లోకి వస్తుందని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ బుధవారం వెల్లడించారు. బస్తర్ లోని జగదల్‌పూర్‌లో ఆయన గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంశదాయీ పెన్షన్ స్కీమ్‌లో ప్రభుత్వ వాటా 14 శాతం నుంచి పెంచుతున్నట్టు వివరించారు. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ, నివాస ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి చట్టాలను ఏడాదిలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చట్టాలు సరళంగా, పారదర్శకంగా, సులభంగా అమలయ్యేలా ఉంటాయని చెప్పారు. ఒబిసిలను వాణిజ్యపరంగా ప్రోత్సహించడానికి పారిశ్రామిక విధానాన్ని సవరించడమౌతుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News