కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం కురిసిన వర్షానికి విషాదం చోటుచేసుకుంది. మంగళవారం కురిసిన వర్షానికి పిడుగులు పడడంతో ఒక కౌలురైతు, ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. వివరాలలోకి వెళితె టారం మండలం దామెరకుంట గ్రామంలో గూడూరి రాజేశ్వర్‌రావు(46)అనే వ్యక్తి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజేశ్వరరావు వ్యవసాయ కూలీగా కౌలురైతుగా జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం పొలం వద్ద వరిపొలంలో కలుపు తీస్తుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్ట ప్రక్కల పొలాలలో పని చేసుకుంటున్న రైతులు, కూలీలు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబానికి పెద్దదిక్కు మృతి చెందడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాటార ఎసై అభినవ్ ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహాదేవపూర్ ఆస్పత్రికి తరలించారు.
చిట్యాల మండలంలో ఇద్దరు మహిళా కూలీలు మృతి…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కైలాపూర్ గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. గ్రామానికి చెందిన చెలివేరు సరిత (30), నెరిపటి మమత(32) అనే ఇద్దరు మహిళలు మిరపనారు వేస్తుండడంతో మంగళవారం కురిసిన వర్షానికి పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు మృతదేహాలపై పడి విలపించిన తీరును చుట్టుప్రక్కల వారిని కంటతడి పెట్టించాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాను ఈ యేడాది వర్షాలు ముంచెత్తడడంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మోరంచపల్లి గ్రామం పూర్తిగా వరదలో చిక్కుకుని నలుగురు మృతి చెందిన ఘటన మరువకముందే మ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం..
- Advertisement -
- Advertisement -
- Advertisement -