Sunday, December 22, 2024

ఒడిశాలో సంచార తెగల మధ్య ఘర్షణ:ఐదుగురి నరికివేత

- Advertisement -
- Advertisement -

ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో రెండు సంచార తెగల మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. మృతులలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. సదర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కరమదిహి గ్రామలో మంగళవారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. వివాహేతర సంబంధాలే ఈ ఘర్ఘణకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐదుగురు వ్యక్తులను ప్రత్యర్థి వర్గం నరికివేసినట్లు వారు చెప్పారు. గాయపడిన నలుగురు వ్యక్తులు సుందర్‌గఢ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు డిఐజి బ్రిజేష్ రే తెలిపారు. ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించి పదునైన ఆయుధాలతో మరో వర్గంపై దాడి చేసినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News