- Advertisement -
మైదరాబాద్: అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొస్తాంధ్ర తీరానికి చేరువగా మిగ్‌జాం తుపాను దూసుకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 210కి.మి, బాపట్లకు 310కిమి, మచిలీపట్నానికి 330 కిమి దూరంలో కేంద్రీకృత మైవుంది. మిగ్‌జాం తుపాను ప్రభావంతో తమిళనాడు అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెన్నై లోని పలు ప్రాంతాలు, రోడ్లు జలమయమైనాయి. దీంతో జనజీవనం స్తంబించిపోయింది. భారీ వర్షాల కారణంగా చెన్నైలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -