ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ వద్ద బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. దూ సముద్రం చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతిచెందారు. ఘటనాస్థలంలో ముగ్గురు మృతిచెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. ట్రాక్టర్ బోల్తా ఘటనలో మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతులను జాటోత్ గోవింద్(65), జాటోత్ బుచ్చమ్మ(60), గుగులోత్ స్వామి(48), సీత(45),శాంతమ్మ(40)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. పెళ్లి పనుల్లో భాగంగా వస్తువులు తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని మృతుల బంధువులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -