బెంగళూరు: కర్ణాటక లోని మంగళూరులో ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్‌లో ఆదివారం రాత్రి ఊపిరాడక ఐదుగురు కూలీలు మృతి చెందారు. కూలీలంతా పశ్చిమబెంగాల్‌కు చెందిన వారని మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమార్ చెప్పారు. ఓ కార్మికుడు చెత్త సేకరణ ట్యాంక్‌లో అపస్మారక స్థితిలో పడిపోయాడని, అతడ్ని కాపాడేందుకు మరో ఏడుగురు ట్యాంక్‌లోకి వెళ్లగా స్పృహ తప్పి పడిపోయారన్నారు. వారందర్నీ ఏజే ఆస్పత్రికి తరలించగా, రాత్రి ముగ్గురు. సోమవారం ఉదయం ఐసీయులో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు.
మృతులంతా 20 22 ఏళ్ల లోపు వారే. ఐసీయూలో ఉన్న మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి మేనేజర్,సూపర్‌వైజర్‌లపై సెక్షన్ 304 ప్రకారం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ప్రొడక్షన్ మేనేజర్ రూబీ జోసెఫ్, ఫీల్డ్ మేనేజర్ కుబేర్‌గాడే, సూపర్‌వైజర్లు మహ్మద్ అన్వర్, ఫరూక్‌ను అదుపు లోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.