Monday, December 23, 2024

బస్సు ఢీకొని భాక్రా కాల్వలో దొర్లిపడిన కారు.. ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Five die, two missing after car falls into Bhakra canal

 

రూప్‌నగర్(పంజాబ్): వెనుక నుంచి వస్తున్న బస్సు ఢీకొనడంతో ఒక కారు భాక్రా కాల్వలో పడి ఐదుగురు మరణించగా మరో ఇద్దరు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సోమవారం ఇక్కడకు సమీపంలోని అహ్మద్‌పూర్ గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోగా ఇద్దరు పిల్లలు మాత్రం ఉధృతంగా ప్రవహిస్తున్న కాల్వలో కొట్టుకుపోయారు. రాజస్థాన్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌తో ఉన్న ఈ కారు శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి రాజస్థాన్‌లోని సికర్‌కు వెళుతోందని డిఎస్‌పి రవీందర్ సింగ్ తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారు సికర్‌కు చెందిన వారని, మృతుల కుటుంబ సభ్యులను ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. కారును వెనుక నుంచి ఢీకొన్నది ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన బస్పని, బసును స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ని అరెస్టు చేశామని ఆయన తెలిపారు. కారులో లభించిన పత్రాల ద్వారా మృతుల వివరాలు తెలుసుకోగలిగామని డిఎస్‌పి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News