- Advertisement -
పితోర్‌గఢ్: ఉత్తరాఖండ్‌లోని సరయూ నదిలో బుధవారం ఐదుగురు యువకులు మునిగిపోయారు. పితోర్‌గఢ్ జిల్లా గంగోలీహత్ సమీపంలోని నదిలో ఈ దుర్ఘటన జరిగింది. ఓ పెళ్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో నదిలో స్నానానికి వెళ్లగా నీటి ఉధృతికి కొట్టుకుపోయారని పోలీసులు తెలిపారు. స్థానికుల సహకారంతో మృతదేహాలను బయటకు తీసినట్టు పోలీసులు తెలిపారు. యువకులంతా కోనాదౌలియా గ్రామానికి చెందినవారిగా గుర్తించామని వారు తెలిపారు.
Five died due to drowned in Sarayu River
- Advertisement -