Monday, December 23, 2024

ఎపిలో సముద్రతీరంలో ఐదుగురు గల్లంతు.. ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

Five drowned on the beach in AP

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్రతీరంలో శుక్రవారం నాడు స్నానానికి దిగిన ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఒకరు మృతి చెందగా ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో గల్లంతైన గుడివాడ పవన్ సూర్యకుమార్ మృతదేహం లభ్యమైంది. ఇక జాలర్లు రక్షించిన సూరిశెట్టి తేజను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన ఐదుగురి కోసం కోస్ట్ గార్డ్స్, మెరైన్ సిబ్బంది గాలిస్తున్నారు. గల్లంతైన విద్యార్థులను గోపాలపట్నానికి చెందిన జగదీశ్, నర్సీపట్నం వాసి జశ్వంత్, మునగపాకకు చెందిన గణేశ్, ఎలమంచిలికి చెందిన రామచందు, గుంటూరు విద్యార్థి సతీశ్‌గా గుర్తించారు. డిఐఇటి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మొత్తం 15 మంది విద్యార్థులు పూడిమడక బీచ్‌లో స్నానాలు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

ఈక్రమంలో ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతైన సమాచారం అందుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, పరిస్థితిని జిల్లా కలెక్టర్, ఎస్‌పి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కాగా అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో జరిగిన విషాద ఘటనపై సిఎం జగన్ ఆరా తీశారు. విద్యార్థుల గల్లంతుపై సీఎం జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయ చర్యలు పర్యవేక్షించాలని, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News