Wednesday, January 22, 2025

చేతబడి అనుమానంతో ఐదుగురి వధ

- Advertisement -
- Advertisement -

స్థానిక జనం చేతబడి అనుమానాలు ఓ కుటుంబానికి శాపంగా దాపురించాయి. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ఎత్కల్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గ్రామస్తులు దారుణంగా చంపేశారు. ఈ కుటుంబం చేతబడులకు దిగుతోందని, మంత్రతంత్రాలు, తాయెత్తులతో అఘాయిత్యాలకు పాల్పడుతోందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ అనుమానం వారిలో బలీయంగా నాటుకుపోయింది. దారుణానికి దారితీసింది. వీరిని తామే చంపేసినట్లు ఐదుగురు స్థానికులు పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపొయ్యారు. ఈ కుటుంబం మంత్రాలు తంత్రాలతో సాగిస్తున్న తంతుతో తమ పిల్లలకు తమకు అన్ని విధాలుగా ముప్పు వాటిల్లిందని,

వీరిని తుదముట్టించడమే సమస్యకు పరిష్కారం అనుకుని ఈ పనికిదిగామని నిందితులు పోలీసులకు తెలియచేసుకున్నారు. సంబంధిత కేసు వివరాలను సుక్మా జిల్లా ఎస్‌పి కిరణ్ జి చవాన్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనకు మావోయిస్టులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తమ ఊరిలో వీరి చేష్టలతో కొందరు ఆస్తులు పోగొట్టుకుని రోడ్ల పాలయ్యారని , ఇంట్లో పిల్లలకు అనారోగ్యం చిక్కులు ఎక్కువ అయ్యాయని నిందితులు చెప్పారని ఎస్‌పి వివరించారు. దాడిలో మృతి చెందిన వారిని మౌసం కన్నా (60), మౌసం బుచ్చా , బిరి, కర్కా లచ్చి, మౌసం అర్జోగా గుర్తించారు. ఎక్తాల్ గ్రామానికే చెందిన సవ్లమ్ రాజేష్, కరం సత్యం , కుంజం ముఖేష్, పొడియం ఎకాలను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News