Monday, December 23, 2024

సెంట్రల్ టెక్సాస్ కాల్పులలో ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

మెక్‌గ్రెగర్(అమెరికా): సెంట్రల్ టెక్సాస్‌లోని ఒక నివాస ప్రాంతంలో గురువారం ఐదుగురు వ్యక్తుల మృతదేహాలు లభించినట్లు అధికారులు తెలిపారు. వ్యాకో నగరానికి సుమారు 32 కిలోమీటర్ల దూరంలోని మెక్‌గ్రెగర్‌లో పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నట్లు టెక్సాస్ ప్రజా భద్రత శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే..అక్కడ ఏం జరిగిందో తెలియరాలేదని ఆయన తెలిపారు. ఆ ఐదు మృతదేహాలపై తుపాకీ తూటాల గాయాలున్నాయా అని విలేకరులు ప్రశ్నించినపుడు మరణాలకు కారణాలేమిటో ఇంకా నిర్ధారించలేదని సార్జంట్ రయాన్ హోవార్డ్ చెప్పారు. ఒక వ్యక్తిని పోలీసులు కాల్చివేశారని, మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారని ఆయన వెల్లడించారు. అయితే..పోలీసు కాల్పులలో మరణించిన వ్యక్తే ఆ ఐదుగురిని చంపాడా అన్న విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదని కూడా ఆయన చెప్పారు.

Five found shot dead in Central Texas

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News