Friday, November 22, 2024

పాకిస్థాన్‌లో క్రికెట్.. హైదరాబాద్‌లో బెట్టింగ్

- Advertisement -
- Advertisement -

Five held for running online cricket betting racket in Hyderabad

ఆరుగురు సభ్యుల ముఠా అరెస్టు
పాకిస్థాన్ సూపర్ లీగ్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితులు
పరారీలో ప్రధాన నిందితుడు
రూ.20లక్షల నగదు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి విసి సజ్జనార్

మనతెలంగాణ, హైదరాబాద్ : పాకిస్థాన్‌లో జరిగే పిఎస్‌ఎల్ (పాకిస్థాన్ సూపర్ లీగ్) క్రికెట్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు సభ్యుల ముఠాలో ఐదుగురు నిందితులు పట్టుబడగా, బెట్టింగ్ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి రూ.20,50,000, 26 మొబైల్ ఫోన్లు, కమ్యూనికేటర్, వైఫై, టివి, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎపిలోని తూర్పుగోదావరిజిల్లాకు చెందిన సోమన్న క్రికెట్ బెట్టింగ్ ప్రధాన నిర్వాహకుడు. ఎపిలోని పశ్చిమ గోదావరి, భీవరానికి చెందిన గుంటూరి సత్యపవన్ కుమార్, పశ్బిమ గోదావరి జిల్లాకు చెందిన ఉద్దర రాజు సతీష్‌రాజు, కృష్ణజిల్లా, మచిలీపట్నంకు చెందిన త్రినాథ్ , నందిపాము భాస్కర్ , జక్కపూడి ప్రసాద్ బెట్టింగ్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు.

ఆరుగురు నిందితులు కలిసి పాకిస్థాన్ సూపర్ లీగ్ క్రికెట్ పోటీల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. లైవ్ లైన్ గురు, క్రికెట్ మజా, లోటస్, బెట్ 365, బెట్ ఫేయిర్ యాప్‌ల ద్వారా నిందితులు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్‌పై ఆసక్తి ఉన్న వారి నుంచి ఆన్‌లైన్ ఆఫ్ లైన్ ద్వారా డబ్బులు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పంటర్లు, ఏజెంట్లను నియమించుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దాదాపుగా 300మంది బెట్టింగ్‌లో పాల్గొన్నారు. విషయం తెలియడంతో మాదాపూర్ ఎస్‌ఓటి, బాచుపల్లి పోలీసులు నిందితులను పట్టుకున్నారు. మాదాపూర్ ఎస్‌ఓటి ఇన్స్‌స్పెక్టర్ శివప్రసాద్, బాచుపల్లి ఇన్స్‌స్పెక్టర్ నర్సింహారెడ్డి, ఎస్సై సాయినాథ్ తదితరులు పట్టుకున్నారు.

సులభంగా డబ్బులు రావు: విసి సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్

కష్టపడితేనే డబ్బులు వస్తాయని, సులభంగా డబ్బులు రావని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలని చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేపట్టవద్దని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలు ఏమి చేస్తున్నారో కనిపెట్టాని కోరారు. బెట్టింగ్ వల్ల చాలామంది జీవితాలు కోలుకోని విధంగా దెబ్బతగులుతున్నాయని తెలిపారు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న వారు బూకీలకు ఇచ్చేందుకు హ్యాండ్ లోన్లు తీసుకుంటున్నారని, ఆస్థులు అమ్ముకుంటున్నారని తెలిపారు. వీటి వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. బెట్టింగ్‌పై సమాచారం ఉంటే డయల్ 100, లేదా 9490617444కు ఫోన్ చేయాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News