Friday, April 4, 2025

అమెరికాలో మరోసారి పేలిన తూటాలు..

- Advertisement -
- Advertisement -

లాస్‌వేగాస్ : అమెరికాలో మరోసారి తూటాలు పేలాయి. ప్రఖ్యాత గాంబ్లింగ్ నగరం లాస్‌వేగాస్‌లో వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. వారం గడవకముందే ఇక్కడ కాల్పుల ఘటనలు జరిగాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఈ హింసాత్మక ఘటనల్లో బలి అయిన వారంతా ఇల్లువాకిలీ లేని వారే. దుండగులు జరిపిన కాల్పుల్లో కొందరు గాయపడ్డారు. వీరిలో ఒక్కరి పరిస్థితి విషమంగా ఉంది. నిరాశ్రయులకు నిలువనీడ నిచ్చే క్యాంప్‌లో కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. అమెరికాలో ఇటీవలి కాలంలో గన్‌కల్చర్ సంస్కృతి అదుపులోకి రాకుండా పోతోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ దేశంలో 500 సామూహిక కాల్పుల ఘటనలు జరిగాయని ప్రభుత్వేతర సంస్థ గన్ వయలన్స్ ఆర్కివ్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News