Wednesday, January 22, 2025

ఐదు అక్రమ నిర్మాణాల కూల్చివేత

- Advertisement -
- Advertisement -

Five illegal construction demolition

 

మనతెలంగాణ/హైదరాబాద్:  హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) పరిధిలో ఐదు అక్రమనిర్మాణాలపై అధికారులు బుధవారం కొరడా ఝుళిపించారు. మున్సిపాలిటీల పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలపై డిస్ట్రిక్ టాస్క్‌ఫోర్స్ బృందాలు, హెచ్‌ఎండిఏ అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా బుధవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో 5 అక్రమ నిర్మాణాలపై డిస్ట్రిక్ టాస్క్‌ఫోర్స్, హెచ్‌ఎండిఏ యంత్రాంగం కూల్చివేతలు చేపట్టింది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్‌లో రెండు, ముంగనూరులో ఒక అక్రమ నిర్మాణం, కోహెడలో ఒక అక్రమ నిర్మాణం తుర్కయంజాల్‌లోని శ్రీరామ్‌నగర్ కాలనీలోని ఒక అక్రమ నిర్మాణంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు 183 అక్రమనిర్మాణాలపై టాస్క్‌ఫోర్స్, హెచ్‌ఎండిఏ అధికారులు చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News