Thursday, January 23, 2025

ఆస్ట్రేలియాలో పబ్‌లోకి దూసుకెళ్లిన ఎస్‌యువి..

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో ఓ లగ్జరీ ఎస్‌యువి వేగంగా ఓ పబ్‌లోకి దూసుకు రావడంతో భారతీయ సంతతికి చెందిన రెండు కుటుంబాలోని అయిదుగురు మృతి చెందారు. ఆదివారం సాయంత్రం డేలెస్‌ఫోర్డ్ హోటల్‌లో లాన్‌లో ఎంజాయ్ చేస్తున్న కస్టమర్లను వేగంగా వచ్చిన ఎస్‌యువి ఢీకొట్టడంతో వివేక్ భాటియా( 38), అతని కుమారుడు విహాన్(11), ప్రతిభా శర్మ(44), ఆమె తొమ్మిదేళ్ల కుమార్తె అన్వి, భాగస్వామి జతిన్ చగ్ (30) మృతి చెందినట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక తెలిపింది. ప్రతిభా శర్మ, కుటుంబం తమ కుటుంబ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

భాటియా, అతని కుమారుడు విహాన్ అక్కడిక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడిన భాటియా భార్య రుచి, ఆరేళ్ల మరో కుమారుడు అబీర్‌ను ఆస్పత్రికి తరలించారు. రెండు కాళ్లు విరిగి తీవ్ర రక్తస్రావంతో ఉన్న అబీర్ పరిస్థితి మొదట్లో విషమంగా ఉండగా ఆ తర్వాత కుదుట పడినట్లు ఆ పత్రిక తెలిపింది. ఈ ఘటనలో గాయపడిన ఓ చిన్నారితో పాటుగా పలువురిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమయిన బిఎండబ్లు సోర్ట్ యుటిలిటీ వాహనం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News