- Advertisement -
కోడేరు ః నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల పరిధిలోని ఎత్తం గ్రామంలోని ఎక్స్ రోడ్డు దగ్గర ఆటోను కారు ఢీ కొట్టిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎత్తం గ్రామానికి చెందిన సాల్మాన్ రాజు ఏపి 21వై 5745 అనే నెంబర్ గల తన ఆటోలో ఎత్తం నుంచి కొల్లాపూర్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా ఎత్తం క్రాస్ రోడ్డు దగ్గర నర్సాయిపల్లి గ్రామానికి చెంది
కేతూరి భవాని శంకర్ అనే వ్యక్తి టిఎస్ 08 ఎఫ్‌ఎక్స్ 7569 నెంబర్ గల కారును అతివేగంగా నడపడంతో ఆటోను ఢీ కొట్టింది. ఆటో డ్రైవర్ సాల్మాన్ రాజుతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న బీరం బుచ్చిరెడ్డి, సవట ఈశ్వరయ్య, వసంత, శాంతమ్మ, శగడి పెద్ద కాశన్న, మారేడు సాయిలు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
- Advertisement -