- Advertisement -
చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. భావుసింగ్ పల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 30 మంది మిర్చి కూలీలు ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కువ మంది ట్రాక్టర్ లో ఎక్కడం వల్లే బండి అదుపుతప్పిందని పోలీసులు తెలిపారు.
- Advertisement -