Monday, January 20, 2025

తెలంగాణ రాష్ట్ర నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః తెలంగాణ రాష్ట్రంలోని 5 నిర్మాణాలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకోవడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికతకు నిదర్శనం ఈ అవార్డులు అని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ మార్గ నిర్దేశంలో రోడ్లు భవనాలు శాఖ అధ్వర్యంలో నిర్మించిన డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లకు ‘ఇంటర్నేషనల్ బ్యూటీఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డులు పొందడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.

సిఎం కెసిఆర్ ముందు చూపు, అకుంఠిత దీక్ష, ప్రకృతి ప్రేమికుడైన ఆయన నిర్మాణ నాణ్యత ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా పర్యావరణ హితంగా నిర్మించడం వల్లే తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఈ అవార్డులు రావడం యావత్ తెలంగాణ సమాజానికి ఎంతో గర్వ కారణమని తెలిపారు. ఇంత గొప్ప చారిత్రాత్మక కట్టడాల్లో తనకు భాగస్వామ్యం కల్పించిన ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్ అండ్ బి శాఖ అధికారులకు, ఇంజనీర్లకు మంత్రి తన శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News