Thursday, December 19, 2024

రోడ్డు ప్రమాదంలో ఇస్రో క్యాంటీన్ ఉద్యోగులు మృతి

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : కేరళ అలప్పూజ జిల్లా అంబల పూజలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇస్రో క్యాంటీన్‌కు చెందిన ఐదుగురు ఉద్యోగులు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రైస్ లోడుతో వెళ్తున్న లారీ, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో మృతి చెందారు. మృతులు ప్రసాద్, శిజు, అమల్, సచిన్, సుమోద్‌గా గుర్తించారు. వీరంతా తిరువనంతపురం లోని ఇస్రో క్యాంటీన్‌లో పనిచేస్తున్నవారు. మృతుల్లో నలుగురు తిరువనంతపురానికి చెందిన వారు కాగా, ఒకరు కొల్లంకు చెందిన వారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్‌ను, క్లీనర్‌ను అదుపు లోకి తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News