Monday, December 23, 2024

ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశృతి.. నదిలో కొట్టుకుపోయిన ఐదుగురు జవాన్లు

- Advertisement -
- Advertisement -

లడఖ్ లో ఇండియన్ ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకుంది. T-72 ఆర్మీ యుద్ధ ట్యాంక్ నదిని దాటుతుండగా.. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో కొట్టకుపోయింది. ఈ ఘటనలో యుద్ధ ట్యాంక్ తోపాటు ఐదుగురు జవాన్లు నీటిప్రవాహంలో కొట్టుకుపోయినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.లడఖ్ లోని నియోమా-చుషుల్ ప్రాంతంలోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఎసి) సమీపంలో దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఐదుగురు సైనికులతో T-72 ట్యాంక్ నదిని దాటుతుండగా ఆకస్మిక వరదల కారణంగా మునిగిపోయింది. అధికారులు తెలిపారు. సంఘటన సమయంలో ట్యాంక్‌లో ఒక జేఓసీ, 4 జవాన్లతో సహా ఐదుగురు సైనికులు ఉన్నారు. ఒకరి ఆచూకీ లభించింది. ఇతరుల కోసం ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News