Monday, January 20, 2025

కర్నాటక కాంగ్రెస్‌లో తిరుగుబాటు

- Advertisement -
- Advertisement -

కర్నాటక కాంగ్రెస్‌లో ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిల నుంచి తిరుగుబాటు ధోరణులు కానవస్తున్నాయి. టిక్కెట్ల వివాదంపై రాజీనామా చేస్తామని కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎంఎల్‌ఎలు, ఇద్దరు ఎంఎల్‌సిలు బెదరించారు. కర్నాటక ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కెహెచ్ మునియప్ప బంధువు ఒకరికి పార్టీ కోలార్ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఇవ్వడం ఈ వివాదానికి దారి తీసింది. కర్నాటక ఉన్నత విద్యా శాఖ మంత్రి, ఆ ఎంఎల్‌ఎలలో ఒకరైన డాక్టర్ ఎంసి సుధాకర్ ఒక టివి చానెల్ విలేకరితో మాట్లాడుతూ, తాము ‘బానిస కాజాలం’ అని ఇతర ఎంఎల్‌ఎలు చెప్పినట్లు తెలియజేశారు. ‘ఆ (మునియప్ప) కుటుంబానికి బానిస కాజాలం’ అని వారు స్పష్టం చేశారు. పార్టీ కుటుంబంలోనే టిక్కెట్లు పంపిణీ చేస్తున్నదని వారు ఆరోపించారు. సుధాకర్ ఆ తరువాత ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ, ‘పార్టీలో ఇతరులకు ఒక అవకాశం లభించాలని కోరుతున్నాం. మేము ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో మాట్లాడతాం.

ఆయన (మునియప్ప) ఇక్కడ ఉన్నప్పుడు ఆయన వ్యవహరణ తీరు వల్ల ఇబ్బంది పడ్డాం.షెడ్యూల్డ్ కులాలకు ప్రాతినిధ్యం లభించడం లేదనే అభిప్రాయం సాధారణంగా కనిపిస్తోంది’ అని చెప్పారు. ‘ఆ కుటుంబం నుంచి కాకుండా ఇతరుల నుంచి అభ్యర్థిని కోరుకుంటున్నాం’ అని సుధాకర్ తెలిపారు. ఎంఎల్‌ఎలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అసెంబ్లీ స్పీకర్‌ను కలుసుకుని రాజీనామాలు సమర్పిస్తామని పార్టీ అధిష్ఠానాన్ని హెచ్చరించారు. తమ అభిప్రాయాలను పార్టీ అధిష్ఠానం విన్నది కానీ తమ డిమాండ్లను పట్టించుకోలేదని కూడా వారు ఆరోపించారు. ఇది ఇలా ఉండగా, మునియప్ప విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ నిర్ణయాన్ని తాను శిరసావహిస్తానని చెప్పారు. ‘కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాను. పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకోనివ్వండి’ అని మునియప్ప అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News