Saturday, December 21, 2024

కొలనులో మునిగి ఐదుగురు పిల్లల మృతి

- Advertisement -
- Advertisement -

Five Kids drown to death in Gujarat

సురేంద్రనగర్: గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఒక కొలనులో మునిగి ఐదుగురు పిల్లలు మరణించారు. మృతులలో నలుగురు బాలికలు ఉన్నారు. నాలుగు నుంచి పదేళ్ల వయస్సు ఉన్న వీరంతా పొలాలలో పనిచేసే వలస కార్మికుల పిల్లలని పోలీసులు తెలిపారు. ధ్రంగాధ్రా తహసిల్‌లోని మెతాన్ గ్రామంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సిఐ టిబి హీరాని తెలిపారు. గ్రామ శివార్లలో ఉన్న కొలనులో స్నానం చేయడానికి వీరంతా అందులో దిగి మునిగిపోయారని ఆమె తెలిపారు. వీరి తల్లిదండ్రులు పొలం పనులలో ఉండడంతో వీరు నీట మునిగిపోవడాన్ని ఎవరూ చూడలేదని ఆమె చెప్పారు. పిల్లలు కనిపించకపోవడంతో వారి కోసం వెతకగా ఒక బాలిక మృతదేహం నీటిలో తేలుతూ వీరికి కనిపించిందని సిఐ తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగా కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు పంపినట్లు సిఐ తెలిపారు.

Five Kids drown to death in Gujarat

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News