- Advertisement -
ఉత్తరాఖండ్ టెహీ జిల్లా లోని దేవప్రయాగ్‌లో శనివారం కారు అదుపు తప్పి నది లోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఒక మహిళ మాత్రం మునిగిపోతున్నకారు నుంచి రూఫ్‌టాప్ పైకి వచ్చి ప్రాణాలు దక్కించుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కారులో దేవప్రయాగ్ మీదుగా వెళ్తుండగా, డ్రైవర్ పట్టుకోల్పోవడంతో కారు అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఒక మహిళ మాత్రం బయటపడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆలోపు వారిని కాపాడే ప్రయత్నాలు చేపట్టారు. నది లోయలో ఉండటంతో సహాయ చర్యలు చాలా కష్టంగా మారాయి. భారీ క్రేన్ల సాయంతో నదిలో మునిగిన కారును బయటకు తీయగలిగారు.
- Advertisement -