Monday, December 23, 2024

మణిపూర్ ఘర్షణలో ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో గురువారం జరిగిన ఘర్షణలలో కనీసం ఐదుగురు మృతి చెందారు. గత మూడురోజులుగా చురాచంద్‌పూర్ బిష్ణుపూర్ సరిహద్దులలో రెండు తెగల మధ్య కాల్పులు పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం చెలరేగిన ఘర్షణలలో ఐదుగురు మృతిచెందినట్లు అధికారులు నిర్థారించారు. మృతులలో ఇద్దరు కుకి జోమి తెగకు చెందిన వారు. వీరిలో ఒక్కరు గేయరచయిత ఎల్‌ఎస్ మంగ్బోయ్ కూడా ఉన్నారు. ఈ రచయిత ఇటీవలే ఘర్షణల నడుమ భావేద్వేగంతో రాసిన ఐ గమ్ హిలో హమ్ అంటే ఈ నేల మనది కాదా? అనే పాట కదిలించివేసింది. ఇప్పుడు తూటాలు , పరస్పర ఘర్షణల నడుమ ఈ గేయ రచయిత ఈ నేలపైనే బలి అయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News