Sunday, December 22, 2024

పాకిస్తాన్‌లో పేలుడు: ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: వాయువ్య పాకిస్తాన్‌లో శుక్రవారం పోలీసులే లక్షంగా జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు మరణించారు. అయితే ఈ దాడికి ఎవరు బాధ్యులో తెలియరాలేదు.

బాంబు పేలుడు జరిగిన డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరం అఫ్ఘానిస్తాన్‌కు సరిహద్దున ఉన్న అటవిక గిరిజన జిల్లాల అంచున ఉంటుంది. స్వదేశీ, విదేశీ ఇస్లామిస్టు ఉగ్రవాదులకు అడ్డాగా ఈ గిరిజన జిల్లాలు ఉన్నాయి. పోలీసు గస్తీ బృందం వెళ్లే మార్గంలో పేలుడు జరిగినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఈ పేలుడులో ఐదుగురు మరణించగా మరో 21 మంది గాయపడ్డారు. ఇది ఆత్మాహుతి బాంబు పేలుడా లేక ఎవరైనా బాంబు పేల్చారా అన్న విషయాన్ని ఆ అధికారి నిర్ధారించలేపోయారు. అంతేగాక మృతులు పోలీసులా లేక పౌరులా అన్న వివరాలు తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News