Thursday, January 16, 2025

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత

- Advertisement -
- Advertisement -

ఇటిక్యాల/నిర్మల్ : వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆదివారం ఐదుగురు మృత్యువాతపడ్డారు. జోగులాంబ జిల్లా ఇటిక్యాల మండల పరిధిలోని బీచుపల్లి సమీపంలో ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని కారు ఢీకొనటంతో ఇద్దరు మృతి చెందారు. ఎస్‌ఐ అశోక్ బాబు తెలిపిన వివరాల మేరకు… తెల్లవారు జామున కృష్ణానది బిడ్జ్రిపై 5గం.ల సమయంలో బొలేరో వాహనం పంక్చర్ కావడంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి డ్రైవర్ మరో వ్యక్తి వాహనానికి పంక్చర్ అయిన టైరు తొలగించి మరో టైరు మారుస్తుండగా వెనుక నుంచి కారు వేగంగా బొలేరో వాహనాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందిన వారు కర్ణాటక హాసన్ జిల్లాకు చెందిన ముత్తు రాజు, సంతులుగా గుర్తించామని కారును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

నిర్మల్ జిల్లాలోని మామడ మండలంలో టిప్పర్‌ను లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే… మామడ మండల పరిధిలోని బూర్గుపల్లి, మొండిగుట్ట మధ్య రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే టిప్పర్ రహదారి పనుల్లో నిమగ్నమైంది. అదే రహదారిలో వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రమాద స్థలంలోనే మృతి చెందగా, ఒకరు నిర్మల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుల్లో కుమ్రం రాజేంద్రప్రసాద్ (31), లాల్‌సింగ్ (43), షేక్ ఖాసీం పీరా(43)గా గుర్తించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నవీన్‌కుమార్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News