- Advertisement -
ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎల్లారెడ్డి మండలం హసన్ పల్లి గేట్ దగ్గర వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ, టాటాఏస్ ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో టాటాఏస్ లో 26 మంది ప్రయాణికులు ఉన్నారని బాధితులు వెల్లడించారు. బాధితులు పిట్లం మండలం చిల్లర్గికి చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రులను ఎల్లారెడ్డి, బాన్సువాడ సర్కార్ దవాఖానాలకు తరలించారు. ఎల్లారెడ్డి సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులను డ్రైవర్ సాయిలు, లచ్చవ్వ, దేవయ్య, కంసవ్వ, కేశయ్యగా పోలీసులు నిర్దారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -