Saturday, January 11, 2025

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

జాతీయ రహదారి 365 పై ఎటువంటి సిగ్నల్ లేకుండా ఆగి ఉన్న ఇసుక లారీని వేగంగా వస్తున్న ప్రైవేట్ బస్సు వెనుక నుండి ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామ శివారు వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సూర్యాపేట డిఎస్‌పి రవి, చివ్వెంల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం …ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు హైదరాబాద్‌లో పనుల కోసం గురువారం మధ్యాహ్నం లారీలో బయలుదేరారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలం పరిధిలోని ఐలాపురం గ్రామ శివారు వద్ద తెల్లవారుజామున ఇసుక లోడుతో ఎలాంటి సిగ్నల్ లేకుండా ఆగి ఉన్న లారీని వెనుక నుండి వేగంగా వస్తున్న బస్సు ఢీకొంది.

ఈ సంఘటనలో రూపు హరిజన్ (51), సునమాని హరిజన్ (61), బస్సు డ్రైవర్ సునీల్ గోర్థ (37), ప్రత్యూష్ ప్రవత్ హరిజన్ (17) ప్రమాద స్థలంలోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ ప్రత్యూష్ ప్రవత్ హరిజన్‌ను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి 108లో తరలించి, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ప్రమాదానికి గురైన బస్సులో పదిమందికి తీవ్రమైన గాయాలు కావడంతో వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మృతుల బంధువు తల్వాడ లాభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేష్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News