వాషింగ్టన్ : కొలరాడో డెన్వర్, లేక్వుడ్ నగరాల్లోని నాలుగు వేర్వేరు ప్రదేశాల్లో సోమవారం సాయంత్రం ఒకే వ్యక్తి జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో నిందితుడిని హతమార్చినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. తొలుత డెన్వర్లో జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. అనంతరం లేక్వుడ్కు వెళ్లి అక్కడ మరొకరిని కాల్చి చంపాడు. మరో వ్యక్తిని గాయపరిచాడని పోలీసులు వివరించారు. కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే లేక్వుడ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతకు ముందు జరిగిన సంఘటనల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడి కారును వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించగా, నిందితుడు కాల్పులకు తెగబడడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే మరణించినట్టు లేక్వుడ్ పోలీసు ప్రతినిధి జాన్ రొమెరో చెప్పారు. ఈ సంఘటనలో ఓ అధికారి గాయపడ్డాడని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని వివరించారు. నిందితుడు ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపాడో తెలియదని, దీనిపై విచారణ సాగుతోందని చెప్పారు.
అమెరికాలో కాల్పుల కలకలం.. నిందితుడితోసహా ఐదుగురి మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -