Thursday, January 23, 2025

తెగిన లిఫ్ట్ వైర్: ఐదుగురు కార్మికులు మృతి

- Advertisement -
- Advertisement -

Five Lab our dead in wire of lift snaps

పాలమూరు: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో పని చేస్తుండగా లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కోల్లాపూర్ మండలం ఏలూరు శివార్లలో జరిగింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో భాగంగా రేగమనగడ్డ వద్ద పంపు హౌజ్ ను నిర్మిస్తున్నారు. కార్మికులు క్రేన్ సహాయంతో పంపులోకి దిగుతుండగా వైర్ తెగిపోవడంతో ఐదుగురు బీహార్ కార్మికులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News