Saturday, November 23, 2024

కశ్మీర్‌లో 18 గంటల ఎన్‌కౌంటర్

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు లష్కరే ఉగ్రవాదులు హతులయ్యారు. రాత్రంతా భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకరస్థాయిలో పరస్పర కాల్పులు జరిగాయి. కుల్గాం జిల్లాలో ఈ ఘటన జరిగిందని శుక్రవారం పోలీసు వర్గాలు తెలిపాయి. చిమ్మచీకట్లో జరిగిన ఎదురుకాల్పుల తరువాత ఉదయం ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఐదుగురు ఉగ్రవాదులు చనిపోయి పడి ఉన్నట్లు గుర్తించారు. 18 గంటల పాటు ఎన్‌కౌంటర్ జరిగిందని కశ్మీర్ జోన్ ఐజి వికె బిర్ధి మీడియాకు తెలిపారు. జిల్లాలోని నెహమా గ్రామంలో ఉగ్రవాదుల సంచారం గురించి తమకు సమాచారం అందిందని, దీనితో తమ దళాలు అక్కడికి వెళ్లినప్పుడు ఎన్‌కౌంటర్ జరిగిందని భద్రతా బలగాల అధికారి ఒక్కరు తెలిపారు.

ఈ గ్రామంలోని సమ్నో ప్రాంతాన్ని భద్రతాబలగాలు చుట్టుముట్టి తమ అదుపులోకి తీసుకున్నాయి. గాలింపు చర్యలు ఉధృతం చేశారు. కాల్పుల నడుమ ఉగ్రవాదులు ఉంటున్న ఇల్లుకు మంటలు అంటుకుని తగులబడింది. మృతులైన ఉగ్రవాదులను గుర్తించారు. వీరిలో సమీర్ అహ్మద్ షేక్, యాసిర్ బిలాల్ భట్, డానిష్ అహ్మద్ తోకర్, హంజుల్లా యాకూబ్ షా, ఉబెయిద్ అహ్మద్ పద్దెర్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా లష్కరే తోయిబా అనుబంధ సంస్థలుగా ఉన్న పిఎఎఫ్‌ఎఫ్, టిఆర్‌ఎఫ్ సంస్థలకు చెందిన వారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News