Wednesday, January 22, 2025

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్ హతం

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఐదుగురు నక్సలైట్లు మరణించగా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గోబెల్ గ్రామ సమీపంలోని ఒర్చా అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. నారాయణ్‌పూర్, కొడగావ్, దంతెవాడ, బస్తర్ జిల్లాలకు చెందిన నొలీపెల .ఇలంలా కి.కంవః గాకెండచ ఇండొ టిబెటన్ బార్డర్ పోలీసుకు చెందిన 45వ బెటాలియన్‌తో కూడిన ఉమ్మడి భద్రతా దళం నక్సల్స్ కోసం కూంబింగ్ జరిగినపుడు ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. కాల్పుల పోరు ఆగిపోయిన అనంతరం పోలీసులు వెళ్లి చూడగా యూనిఫారాలలో ఉన్న ఐదుగురు నక్సలైట్ల మృతదేహాలు కనిపించాయని వారు చెప్పారు. వారి నుంచి కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను కలుపుకుంటే ఈ ఏడాదిలో ఇప్పటివరకు రాష్ట్రంలో భద్రతా దళాల ఎదురుకాల్పులలో మరణించిన నక్సల్స్ సంఖ్య 122కి చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News