- Advertisement -
పాట్నా: ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బిహార్ రాష్ట్రం సుపాల్ జిల్లా రాఘోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గడ్డీ గ్రామంలో దంపతులు తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉరేసుకున్నారు. రెండు మూడు రోజుల నుంచి తలుపులు తీయకపోవడంతో ఇంటి పరిసరాల్లోకి వెళ్లగానే స్థానికులకు దుర్వాసన వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌పి మనోజ్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తలపులు బద్దలుకొట్టి చూడగా ఐదుగురు ఉరేసుకొని కనిపించారు. వెంటనే మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్ నిమిత్తం సుపాల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మూడు రోజుల కిందట ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సదరు కుటుంబానికి అప్పులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
- Advertisement -