Wednesday, January 22, 2025

పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం: ఐదుగురు సజీవదహనం…

- Advertisement -
- Advertisement -

లక్నో: పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ఐదుగురు సజీవదహనమైన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మొరాదాబాద్ లో ఓ మూడంతస్థుల భవనంలో పెళ్లి వేడుక జరుగుతుంది. ఒక్కసారిగా మంటలు చెలరేడంతో అందరూ పరుగులు తీశారు. ఈ మంటల్లో ఐదుగురు సజీవదహనమయ్యారు. మృతులలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News