Monday, December 23, 2024

కాల్పులు జరిపిన బాలుడు: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: బాలుడు కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందిన సంఘటన అమెరికాలోని ఉత్తర కరోలినాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాలీ నగరంలోని నీస్ వద్ద గ్రీన్ వే ప్రాంతంలో బాలుడు బయటకు వచ్చి విచాక్షణ రహితంగా కాల్పులు జరపడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని అదుపులోకి తీసుకున్నారని మేయర్ మారీ అన్నా బాల్డ్‌విన్ తెలిపాడు. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానికి ఆస్పత్రికి తరలించారు. అమెరికాలో రోజు రోజుకు గన్ కల్చర్ పెరుగుతోంది. 2022లోనే ఇప్పటి వరకు తుపాకీ కాల్పులలో 34000 మంది చనిపోయారు. వీరిలో సగం మంది గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో ఫ్లోరిడాలోని ఓ స్కూళ్లో దుండగుడు తుపాకీతో కాల్పులు జరపడంతో 18 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నిందితుడికి కోర్టు మరణశిక్ష విధించేందుకు నిరాకరించింది.

 

ఇవి కూడా చదవండి

ఒంగోలులో బైక్ తో ఢీకొట్టి…. మహిళపై అత్యాచారం…

ప్రేమ వ్యవహారం.. యువకుడి కిడ్నాప్, హత్య

యువతిని రైలు కింద తోసేసి…

ప్రేమించిన టీచర్‌కు పెళ్లి నిశ్చయం.. విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News