Wednesday, December 25, 2024

కారును ఢీకొట్టిన లారీ: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: బియ్యం లోడుతో వెళ్తున్న లారీ కారును ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందిన సంఘటన కేరళ రాష్ట్రం అలప్పూజ జిల్లా అంబలపూజలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆంధ్రప్రదేశ్ నుంచి బియ్యం లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతులు ఇస్రో క్యాంటీన్‌లో పని చేస్తున్న ఉద్యోగులుగా గుర్తించారు. మృతులు తిరువనంతపురం చెందిన సుమోద్, సచిన్ ప్రసాదర్, శిజు, అమల్‌గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News