Thursday, January 23, 2025

ట్రాక్టర్-లారీ ఢీ: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

జైపూర్: దేవాలయానికి వెళ్లి తిరిగొస్తుండగా ట్రాక్టర్-లారీ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందిన సంఘటన రాజస్తాన్ రాష్ట్రం పాలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జైసల్మేర్ లోని రామ్ దేవరా ఆలయాన్ని సందర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News